అరవింద సమేతంగా తెలుగమ్మాయి !

అరవింద సమేతంగా తెలుగమ్మాయి !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ను అందుకుంది. రాయలసీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో తెలుగమ్మాయి ఈషా రెబ్బా కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని తెలుస్తోంది. 

ఇది వరకే జరిగిన మొదటి షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. అదునులో నుండి ఓ మాస్ స్టిల్ ను తీసుకుని ఫస్ట్ లుక్ చిత్రబృందం డిజైన్ చేసింది. సిక్స్ ప్యాక్ బాడీతో ఎన్టీఆర్ కనిపించడంతో ప్రేక్షకులు ఫుల్ కఖుషి అయ్యారు. మొదటి సారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలిసి సినిమా చేస్తుండడంతో ఆరంభం నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాములుగా త్రివిక్రమ్ సినిమాల్లో అమ్మాయి పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఇప్పుడు ఈషా రెబ్బాను తీసుకుంటుండడంతో మంచి పాత్రే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం ఏదైనా వెలువడుతుందేమో చూడాలి. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా, ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.