నా రంగుతో నేను సంతోషంగా ఉన్నా - ఈషా రెబ్బ

నా రంగుతో నేను సంతోషంగా ఉన్నా - ఈషా రెబ్బ

పేరుకు తెలుగు సినిమానే కానీ మనకు తెలుగు నేపథ్యం ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ.  ప్రస్తుతం పరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వారంతా ఇతర భాషల నుండి, పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వారే.  ఒకవేళ తెలుగమ్మాయిలు ఎవరైనా హీరోయిన్ అవుదామని ట్రై చేసినా వాళ్ళకు ఆఫర్లు తక్కువగానే వస్తుంటాయి.  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్ని తట్టుకుని ఇప్పుడిప్పుడే కథానాయకిగా నిలదొక్కుకుంటోంది ఈషా రెబ్బ. 

'అమీ తుమీ, అ !' వంటి సినిమాలతో మెప్పించిన ఆమె కొద్దిరోజుల క్రితం విడుదలైన ఎన్టీఆర్ యొక్క 'అరవింద సమేత'లో సైతం నటించింది.  తాజాగా సోషల్ మీడియాలో ఒక నెటిజన్ ఈషాగారు మీరు ఇంకొంచెం కలర్ ఉంటే మీకు ఎదురే ఉండేది కాదు అని కామెంట్ చేయగా దానికి ఈషా ఎందుకండీ ఈ కలర్ పిచ్చి.. నాకున్న రంగుతో నేను సంతోషంగా ఉన్నాను.  హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ హీరోయిన్లు మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.