లక్కీ అంటే ఇషాదే..!

లక్కీ అంటే ఇషాదే..!

సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ కోసం చాలామంది పడిగాపులు కాస్తుంటారు.  కానీ, అవకాశాలు కొందరికే వస్తుంటాయి.  అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కెరీర్ మంచిగా ఉంటుంది.  లేదంటే ఒకటి రెండు సినిమాలకే పరిమితం కావలసి వస్తుంది.  సుబ్రహ్మణ్యపురం, అమితుమీ సినిమాల్లో నటించిన ఇషా రెబ్బకు దిమ్మతిరిగే అవకాశం లభించింది.  ఏకంగా ఇప్పుడు ఈ అమ్మడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.  దీంతో ఈ అమ్మడి లక్ మారిపోనున్నది.  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా తెలుగమ్మాయిని తీసుకోవాలని అనుకున్నాడట త్రివిక్రమ్.  అమితుమీ సినిమా చూసిన తరువాత ఇషా అయితే క్యారెక్టర్ కు కరెక్ట్ గా సరిపోతుందని చెప్పి ఆమెకు అవకాశం ఇచ్చారట.  ఎన్టీఆర్ తో సినిమా అంటే ఎవరైనా ఎందుకు వదిలేసుకుంటారు.  ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే ఒకే చేసిందట ఈ అమ్మడు.