హోలీ వేడుకల్లో మసూద్, హఫీజ్ దిష్టిబొమ్మల దగ్థం

హోలీ వేడుకల్లో మసూద్, హఫీజ్ దిష్టిబొమ్మల దగ్థం

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోకుల్‌లో నిర్వహించిన వేడుకల్లో యువత నృత్యాలతో అదరగొట్టారు. ముంబై, పాట్నాలో జైషే ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజర్‌, ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ల దిష్టి బొమ్మలను దహనం చేశారు. వందేమాతరం నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. 

‘రాక్షసులను అంతం చేయాలి. అందుకే మసూద్‌, దావూద్‌, సయీద్‌ దిష్టిబొమ్మలను దగ్దం చేశాం.. పుల్వామా దాడి లేదా మరో ఉగ్రదాడే కావొచ్చు.. భారత్‌లో జరిగే అన్ని ఉగ్ర ఘాతుకాలకు ఈ ముగ్గురే కారణం. అందుకే వారికి శిక్ష పడాలి’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శివసేన నేత రాహుల్ శేవాలా తెలిపారు.