ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై లైంగిక ఆరోపణలు

ఇఫ్లూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పై లైంగిక ఆరోపణలు

హైదరాబాద్ ఇఫ్లూ క్యాంపస్ లో దారుణం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రంజిత్ తంకప్పన్ తనతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడని ఓ విద్యార్ధిని ఉస్మానియా యూనివర్సిటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గతంలో ఓ మహిళను వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తుంది. పరారీలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.