కేక్ కట్ చేసినందుకు... మహిళ అరెస్ట్... అసలు కారణం ఇదే 

కేక్ కట్ చేసినందుకు... మహిళ అరెస్ట్... అసలు కారణం ఇదే 

ఇటీవల కాలంలో ప్రతి సెలబ్రేషన్ కి కేక్ కట్ చేయడం ఆనవాయితీగా మారింది.  అయితే, ఈజిప్టు కు చెందిన ఓ మహిళ ఇలానే కేక్ ను కట్ చేసింది.  కేక్ కట్ చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.  కేక్ కట్ చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా.  ఆమె కట్ చేసింది మామూలు కేకు కాదు.  మనిషి ప్రైవేట్ పార్ట్ ఆకారంలో ఉన్న కేకులు కావడంతో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో చెప్పక్కర్లేదు.  ఎవరైనా సరే ఆ చట్టాలకు లోబడే నడుచుకోవాలి.  అతిక్రమించే పడే శిక్షలు కూడా దారుణంగా ఉంటాయి.  నిబంధనలకు విరుద్ధంగా మహిళ కేక్ ను కట్ చేసిందని చెప్పి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే, దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.  దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నది.