ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేసి జైలు పాలైంది

ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేసి జైలు పాలైంది

ఈజిప్టుకు చెందిన అమల్ ఫాతీ అనే మహిళ అత్యుత్సాహం ప్రదర్శించి జైలు పాలైంది. తనపై అత్యాచారం జరిగిందంటూ ఫేస్ బుక్ లో తప్పుడు వీడియోను పోస్ట్ చేసింది. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవడంలేదంటూ మండిపడింది. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో పలు చానెల్స్ ప్రసారం కూడా చేశాయి. నకిలీ వదంతులను ప్రచారం చేసినందుకు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఆరోపణలు పూర్తి నిరాధారమైనవిగా తేలింది. జాతీయ భద్రతకు భంగం కలిగించేలా నకిలీ వార్తలను వ్యాప్తి చేసినందుకు ఫాతీకి రెండేళ్ల జైలు శిక్ష, 560 డాలర్ల జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.