ఈఫిల్ టవర్ నిర్మించి 130 ఏళ్లు పూర్తి

ఈఫిల్ టవర్ నిర్మించి 130 ఏళ్లు పూర్తి

ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ను నిర్మించి బుధవారంతో 130 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈఫిల్ టవర్‌ను విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక లేజర్ షో ఏర్పాటు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 నుంచి అర్ధరాత్రి వరకు లేజర్ షో నిర్వహించినట్లు ఫ్రాన్ మీడియా తెలిపింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ను 1889లో నిర్మించారు. దీని ఎత్తు 324 మీటర్లు కాగా దీని నిర్మాణానికి 300 టన్నుల ఉక్కు వాడారు. ఏటా ఈఫిల్ టవర్‌ను సగటున 70 లక్షలు మంది సందర్శిస్తుంటారు.