ఎనిమిది ఎయిర్‌పోర్టులు మూత..

ఎనిమిది ఎయిర్‌పోర్టులు మూత..

భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.. భారత వాయుసేన దాడులను జీర్ణించుకోలేని పాక్.. కవ్వింపు చర్యలకు దిగుతుండగా.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం విమానాల రాకపోకలను నిలిపివేసింది. ముందస్తుగా దేశంలోని ఎనిమిది ఎయిర్‌పోర్ట్‌లను మూసివేసింది భారత్ ఎయిర్‌పోర్ట్ అథారిటి. మరో ఆరు విమానాశ్రయాలకు విమాన సర్వీసులు నిలిపివేసింది. దీంతో అమృత్‌సర్, పఠాన్ కోట్, శ్రీనగర్, జమ్మూ, లెహ్, మనాలి, ధర్మశాల, డెహ్రాడూన్ తదితర ఎయిర్‌పోర్ట్‌లకు విమానాల సర్వీసులు నిలిచిపోయాయి. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఎనిమది విమానాశ్రయాలు, దేశవ్యాప్తంగా 14 ఎయిర్‌పోర్టులు  మూడు నెలల పాటు పౌరవిమానయాన సేవలకు అందుబాటులో ఉండవు.