తేజ్ ప్రతాప్ యాదవ్ బౌన్సర్ వీరంగం

తేజ్ ప్రతాప్ యాదవ్ బౌన్సర్ వీరంగం

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ బౌన్సర్ ఒకరు వీరంగం సృష్టించాడు. ఏడో విడత ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తేజ్‌ ప్రతాప్‌ ఓటు వేసే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయితే ఈ సందర్భంగా తేజ్‌ ప్రతాప్‌ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఓ ఫోటోగ్రాఫర్‌‌... కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ తేజ్‌ప్రతాప్‌ బౌన్సర్‌ దౌర్జన్యం చేసి, అతడిపై చేయి చేసుకుని కెమెరాను ధ్వంసం చేశాడు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంత జరిగినా తేజ్‌ప్రతాప్‌ నోరుమెదపలేదు. తనను హతమార్చేందుకు కుట్ర జరిగిందని ఆయన ఆరోపించడం గమనార్హం.