మహిళల బదులు ఓటేసిన పోలింగ్ ఏజెంట్ అరెస్ట్

మహిళల బదులు ఓటేసిన పోలింగ్ ఏజెంట్ అరెస్ట్

హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలో నిన్న జరిగిన ఎన్నికల్లో అసావటి పోలింగ్ బూత్ లో ఓ పోలింగ్ ఏజెంట్ మహిళలకు బదులు ఓటు వేశాడు. ఈవీఎం దగ్గర మహిళలు ఉండగానే అతడు ఓట్లు వేసి వచ్చాడు. అలా ముగ్గురు మహిళల ఓట్లు పోలింగ్ ఏజెంట్ వేయడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయి ఈసీ దృష్టికి వెళ్లింది. వెంటనే ఎన్నికల సంఘం ఆ పోలింగ్ ఏజెంట్ పై చర్యలు తీసుకుంది. అతడిని అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.