వీవీప్యాట్‌ స్లిప్పుల కలకలంపై ద్వివేది స్పందన

వీవీప్యాట్‌ స్లిప్పుల కలకలంపై ద్వివేది స్పందన

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాట్‌ స్లిప్పుల కలకలంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పందించారు. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పులు పోలింగ్ రోజువి కాదని తెలిపారు. ఆ పాఠశాల ఈవీఎంల కమీషనింగ్ సెంటర్ మాత్రమేనని అన్నారు. పోలింగ్‌కు ముందు వెయ్యి ఓట్లను బెల్‌ ఇంజినీర్లు పోల్‌ చేశారని, ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయని నిర్థరించుకున్నాకే కేంద్రాలకు తరలించినట్టు వివరించారు. ఎవరో ఉద్యోగి ఉద్దేశపూర్వకంగా ఈ స్లిప్పులను బయట పడేశారని ద్వివేది తెలిపారు.