అక్కడ ఎన్నికలు రద్దుకాలేదు !

అక్కడ ఎన్నికలు రద్దుకాలేదు !

తమిళనాడులోని వెల్లూరులో జరిగిన ఐటీ సోదాల్లో స్థానిక డీఎంకే కార్యాలయం నుండి భారీగా నగదు లభించిన సంగతి తెలిసిందే.  ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, అందుకే వెల్లూరు లోక్ సభ ఎన్నికల్ని వాయిదావేయాలని ఎన్నికల సంఘం ఢిల్లీ అధికారులకు లేఖ రాసినట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలపై స్పందించిన ఎన్నికల కమీషన్ ఎన్నికల రద్దుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చి చెప్పింది.