సన్నీ డియోల్ ఫ్యాన్ పేస్ బుక్ పేజీ పై ఈసీ ఆగ్రహం

సన్నీ డియోల్ ఫ్యాన్ పేస్ బుక్ పేజీ పై ఈసీ ఆగ్రహం

దేశంలో ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి.  ఈనెల 19 వ తేదీతో ఎన్నికలు ముగియబోతున్నాయి.  ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని ఈసి ప్రకటించిన సంగతి తెలిసిందే.  అయితే, బీజేపీ నేత, గురుదాస్ పూర్ లోక్ సభ అభ్యర్ది సన్నీ డియోల్ కు చెందిన పేస్ బుక్ ఫ్యాన్ పేజీలో అయన ప్రచారానికి సంబంధించిన కొన్ని విషయాలను పోస్ట్ చేశారు ఫ్యాన్స్.  

దీనిపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.  దీంతో ఆగ్రహించిన ఈసీ సన్నీ డియోల్ పేస్ బుక్ పేజీ పోస్టింగ్ ఖర్చు రూ. 1.74 లక్షల రూపాయలను ఎన్నికల ఖర్చుగా చూపించాలని ఆదేశాలు జారీ చేసింది.