ఆదిత్యనాథ్, మాయావతిపై ఈసీ ఆగ్రహం !

ఆదిత్యనాథ్, మాయావతిపై ఈసీ ఆగ్రహం !

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీల నడుమ విమర్శల వేడి రాజుకుంటోంది.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, బిఎస్పీల నడుమ హోరాహోరీ పోరు నెలకొంది.  ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిఎస్పీ అధినేత్రి మాయావతి ఘాటైన ప్రసంగాలు చేస్తున్నారు.  అందులో కులాల ప్రస్తావన ఎక్కువగా తెస్తున్నారు.  దీంతో సుప్రీం కోర్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నవారిని ఎందుకు తేలికగా తీసుకుంటున్నారని ఎలక్షన్ కమీషన్ కు సుప్రీమ్ కోర్టు చురకలంటించింది. 

దీంతో ఎన్నికల కమీషన్ వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  రేపు ఉదయం ఆరు గంటల నుండి  48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మాయావతిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం రేపు ఉదయం ఆరు గంటల నుండి 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఆంక్షలు విధించింది.