ఎన్నికల లోపాలపై ఈసీ సమాధానం చెప్పాలి

ఎన్నికల లోపాలపై ఈసీ సమాధానం చెప్పాలి

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణా లోపాలపై ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్ధులు డబ్బు విచ్చలవిడిగా వెదజల్లారని ఆరోపించారు. కొన్నిచోట్ల పోలింగ్ సిబ్బందికి కూడా డబ్బు అందించారని అన్నారు. వేసవి కాలంలో ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆయన ఆరోపించారు. హింస పెచ్చరిల్లి మరణాలు సంభవించడం విచారకరమని తెలిపారు. 

వందల సంఖ్యలో ఈవీయంలు మొరాయించాయి. ఈసీ సీజ్ చేసిన కోట్లాది రూపాయల డబ్బు ఎవరిదో వెల్లడించాలి. సీజ్ చేసిన డబ్బుకు సంబంధించి ఇప్పటివరకు ఏ అభ్యర్ధులపై చర్యలు తీసుకోలేదు. ఎన్నికల నిర్వహణలో ఆర్ ఎస్ ఎస్ వాదులకు అవకాశమివ్వడం సరికాదు. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ లోపాలుగా పరిగణించాలి. ఈ లోపాలపై ఈసీ ప్రజలకు సమాధానం చెప్పాలి అని రామకృష్ణ ఎలక్షన్ కమిషన్ ను నిలదీశారు.