విపక్షాల ప్రతిపాదనకు ఈసీ నో..

విపక్షాల ప్రతిపాదనకు ఈసీ నో..

విపక్షాల ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. పూర్తిస్థాయి కౌంటింగ్ ప్రారంభంచడానికి ముందుగా, ప్రతీ నియోజకవర్గంలోనూ ఐదు ఈవీఎంలు, ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని తిరస్కరించింది ఎన్నికల సంఘం. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసిన సీఈసీ... యథావిథిగా పాత మార్గదర్శకాలే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసేందుకు కూడా ఈసీ నిరాకరించింది.