మోడీ సినిమాకు ఈసీ బ్రేక్ !

మోడీ సినిమాకు ఈసీ బ్రేక్ !

ప్రధాని మోడీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఒమంగ్ కుమార్ నిర్మించిన 'పీఎం నరేంద్ర మోడీ' సినిమా విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదల చేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ చిత్రం వల్ల క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఈసీ తెలిపింది. ఈ చిత్రం గురువారం ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉంది. సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఇంతకుముందు ఈ చిత్రం విడుదలపై సుప్రీం కోర్టు సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తాజాగా ఈసీ ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా పడింది.