లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి పోటీ చేసే అభ్యర్థులకు షాక్...

లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి పోటీ చేసే అభ్యర్థులకు షాక్...
లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఇక నుండి ఆ అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు. ఒక్కో అభ్యర్థి ఒక్కో స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలన్న ప్రతిపాదనలకు భారత ఎన్నికల సంఘం మద్దతు తెలుపుతున్నట్టు సుప్రీంకోర్టుకు నివేదికను ఇచ్చింది. పోటీ చేసే అభ్యర్థి ఒక స్థానం కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా చూడాలని కోరుతూ పిల్ దాఖలైంది. ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించిన అభ్యర్థులు.. గెలిచిన ఒక నియోజకవర్గాన్ని వదిలి మరో నియోజకవర్గానికి వెళ్లడం ఓటర్లకు అన్యాయం చేయడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది.