పెళ్లిలోనూ కౌంటింగ్ ఫీవర్..

పెళ్లిలోనూ కౌంటింగ్ ఫీవర్..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫీవరే... ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉత్కంఠగా ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్నారు. కొన్ని హోటళ్లలో వీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా... పెళ్లి మంటపాల్లో ఏర్పాట్లు చేసిన భారీ స్క్రీన్స్‌లో సైతం ఎన్నికల ఫలితాలనే వీక్షిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాగంగా... ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల ఫలితాలు.. తెలంగాణలోని లోక్‌సభ స్థానాలు వెలువడుతుండడంతో.. హైదరాబాద్‌లో ఓ కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లో ఎన్టీవీని పెట్టుకుని పెళ్లికి హాజరైన వారు ఎన్నికల ఫలితాలను వీక్షిస్తున్నారు.