ఏపీలో తొలి ఫలితం ఈ నియోజకవర్గానిదే..

ఏపీలో తొలి ఫలితం ఈ నియోజకవర్గానిదే..

మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ ప్రారంభంకానుంది. 12 గంటల సమయానికి ట్రెండ్‌ తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. అధికారిక ఫలితాలు రాత్రి 9 గంటల తర్వాతేనని స్పష్టం చేస్తున్నారు.  ఏపీకి సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఇక్కడ 13 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ఆచంట, కొవ్వూరులలో 14 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.  రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి. ఈ రెండు చోట్లా ఓట్ల లెక్కింపునకు 36-37 రౌండ్లు పట్టనుంది.