ఒడిషాలో బీజేడీ, బీజేపీల హోరాహోరీ

ఒడిషాలో బీజేడీ, బీజేపీల హోరాహోరీ

ఒడిషాలో బీజేపీ అద్భుత ఫలితాలు రాబట్టింది. 21 లోక్ సభ స్థానాల్లో 6 చోట్ల ఆధిక్యతలో ఉంది. రాష్ట్రంలో అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ) 15 సీట్లలో హోరాహోరీ పోరులో అధిక్యంలో కొనసాగుతోంది. 2014లో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిన బీజేపీకి ఇది పెద్ద ముందడుగుగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఉదయం ఒడిషాలోని 21 లోక్ సభ, 146 అసెంబ్లీ సీట్లకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే ఆరంభ ట్రెండ్స్ లో లోక్ సభ స్థానాల్లో బీజేపీ, అసెంబ్లీ సీట్లలో బీజేడీ ఆధిక్యంలో ఉన్నాయి.

2014 లోక్ సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ స్వీప్ చేసింది. 21 లోక్ సభ సీట్లలో 20 గెలుచుకొని తిరుగులేని ఆధిపత్యం సాధించింది. అయితే గత వారం ఎగ్జిట్ పోల్స్ అన్నిటిని కలిపి నిర్వహించిన పోల్ ఆఫ్ పోల్స్ లో ఒడిషాలో బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనాలు వచ్చాయి.