17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే..

సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. పోలింగ్‌ తేదీలు, ఎన్నికల నిర్వహణ వివరాలను ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా వెల్లడించారు. మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మకంగా ఉన్న జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం షెడ్యూల్‌లో చోటు కల్పించలేదు.