ఏ రాష్ట్రంలో.. ఎప్పుడెప్పుడు..

ఏ రాష్ట్రంలో.. ఎప్పుడెప్పుడు..

లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. పోలింగ్‌ తేదీలు, ఎన్నికల నిర్వహణ వివరాలను ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా వెల్లడించారు. మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 

మొదటి ఎన్నికలు జరిగే రాష్ట్రాలు - మొత్తం నియోజకవర్గాలు 91
ఆంధ్ర (25 నియోజకవర్గాల్లో), అరుణాచల్‌ప్రదేశ్ (2), అసోం (5), బీహార్‌ (4), ఛత్తీస్‌గఢ్‌ (1), జమ్మూ కశ్మీర్‌ (2), మహారాష్ట్ర (7), మణిపూర్‌ (1), మేఘాలయం (2), మిజోరామ్‌ (1), నాగాలాండ్‌ (1), ఒడిశా (4), సిక్కిం (1), తెలంగాణ (17), త్రిపుర (1), యూపీ (8), ఉత్తరాఖండ్‌ (5), పశ్చిమబెంగాల్‌ (2), అండమాన్‌ (1), లక్షద్వీప్‌ (1) 

రెండో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు - మొత్తం నియోజకవర్గాలు 97
అసోం (5 నియోజకవర్గాల్లో), బీహార్‌ (5), ఛత్తీస్‌గఢ్‌ (3), జమ్మూకశ్మీర్‌ (2), కర్నాటక (14), మహారాష్ట్ర (10), మణిపూర్‌ (1), ఒడిశా (5), తమిళనాడు (39), త్రిపుర (1), యూపీ (8), పశ్చిమబెంగాల్‌ (3), పాండిచ్చేరి (1) 

మూడో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు - మొత్తం నియోజకవర్గాలు 115
అసోం (4), బీహార్‌ (5), గుజరాత్‌ (36), గోవా (2), జమ్మూకశ్మీర్‌ (1), కర్ణాటక (14), మహారాష్ట్ర (14), ఒడిశా (6), యూపీ (10), పశ్చిమ బెంగాల్‌ (5), దాద్రా (1), డామన్‌ (1)

నాలుగో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు - మొత్తం నియోజకవర్గాలు 71
బీహార్‌ (5 నియోజకవర్గాల్లో), జమ్మూకశ్మీర్‌ (1), మధ్యప్రదేశ్‌ (6), మహారాష్ట్ర (17), ఒడిశా (17), రాజస్థాన్‌ (13), యూపీ (13), పశ్చిమ బెంగాల్‌ (8) 

ఐదో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు - మొత్తం నియోజకవర్గాలు 51
బీహార్‌ (5 నియోజకవర్గాల్లో), జమ్మూకశ్మీర్‌ (2), జార్ఖండ్‌ (4), మధ్యప్రదేశ్‌ (7), రాజస్థాన్‌ (12), యూపీ (14), పశ్చిమ బెంగాల్‌ (7)

ఆరో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు - మొత్తం నియోజకవర్గాలు 59
బీహార్‌ (8 నియోజకవర్గాల్లో), హర్యానా (10), జార్ఖండ్‌ (4), మధ్యప్రదేశ్‌ (8), యూపీ (14), పశ్చిమబెంగాల్‌ (8), ఢిల్లీ (7)

ఏడో విడత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు - మొత్తం నియోజకవర్గాలు 59
బీహార్‌ (8 నియోజకవర్గాల్లో), జార్ఖండ్‌ (3), మధ్యప్రదేశ్ (8), పంజాబ్‌ (13), పశ్చిమ బెంగాల్‌ (9), ఛండీగఢ్‌ (1), యూపీ (13), హిమాచల్‌ప్రదేశ్ (4)