ఒకే రోజున ఏపీ, తెలంగాణ ఎన్నికలు

ఒకే రోజున ఏపీ, తెలంగాణ ఎన్నికలు

 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్‌ 11న మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తారు. 

తొలి దశ ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..!

  • ఎన్నికల నోటిఫికేషన్‌ - మార్చి 18న
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ -మార్చి 26
  • నామినేషన్ల పరిశీలన - మార్చి 26
  • నామినేషన్ల ఉపసంహరణ -మార్చి 28
  • పోలింగ్‌ -ఏప్రిల్‌ 11న
  • ఓట్ల లెక్కింపు -మే 23న