బీజేపీలో చేరిన గాయకుడు దలేర్ మెహందీ

బీజేపీలో చేరిన గాయకుడు దలేర్ మెహందీ

లోక్ సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ దగ్గరపడుతున్న వేళ సినీ ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారు. సన్నిడియోల్, హన్స్ రాజ్ హన్స్ తరువాత ప్రముఖ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. దలెర్‌ మెహిందీకి బీజేపీ వాయువ్య ఢిల్లీ బీజేపీ అభ్యర్థి హన్స్‌రాజ్‌ హన్స్‌, కేంద్రమంత్రి విజయ్‌ గోయల్‌ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ, చాందినీ చౌక్‌ అభ్యర్థి హర్షవర్దన్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. దలెర్‌ మెహిందీ కూతురు ప్రముఖ సింగర్, బీజేపీ నేత హన్స్‌రాజ్‌ హన్స్‌ కుమారుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.