రాహుల్ గాంధీకి ఈసీ క్లీన్ చిట్

రాహుల్ గాంధీకి ఈసీ క్లీన్ చిట్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం గురువారం క్లీన్ చిట్ ఇచ్చింది. మధ్యప్రదేశ్ లో ప్రసంగించిన రాహుల్ ఎలాంటి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ ప్రకటించింది. ఏప్రిల్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హత్యకేసులో నిందితుడని పేర్కొన్నారు. ఇది ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. 

'హత్యకేసులో నిందితుడు అమిత్ షా, వాహ్ ఎంత అద్భుతం! మీరు జయ్ షా పేరు విన్నారా? అతనో మాంత్రికుడు. రూ.50,000ను కేవలం 3 నెలల్లో రూ.80 కోట్లు చేశాడు' అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఎద్దేవాకు ప్రతిస్పందిస్తూ షా 'ఆ వరుస క్రమాన్ని నేను చెబుతాను. నాపై ఒక నకిలీ కేసు బనాయించారు. దానిపై కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. అది ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ దురుద్దేశంతో చేసిన ఆరోపణగా తేల్చింది. రాహుల్ గాంధీ న్యాయపరమైన అవగాహనపై నేనెలాంటి వ్యాఖ్య చేయదలచుకోలేదని' అన్నారు.