గోమాతనూ వదలని బీజేపీ 

గోమాతనూ వదలని బీజేపీ 

ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు జరగటం సహజం. ఎన్నికలు దగ్గరపడే కొద్ది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రచారానికి తెరలేపుతారు. అభ్యర్థులు తమ పేర్లు ప్రచారం చేసుకునేందుకు గోడలు, ఫ్లెక్సీలను వాడుతారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ లో బీజేపీ నేతల ప్రచారం మరింత పీక్ స్టేజికి వెళ్లింది. ఆ పార్టీ నేతలు ప్రచారానికి గోమాతలను కూడా  వదలటం లేదు. ఆవులపై పార్టీ గుర్తులు వేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో 
గోవులు కూడా పొలిటికల్ ప్రచార సాధనాలయ్యాయి. పేయింట్ తో కమలం గుర్తు, పార్టీ రంగులను వేయటంతో గోమాత చర్మంపై ప్రభావం చూపుతుందని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. 

 

Elections in MP weeks away. Even the cow has turned political. #MadhyaPradeshElections2018 pic.twitter.com/kkvUghCxEp