2026 నుంచి ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ మాత్రమే!

2026 నుంచి ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ మాత్రమే!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించిన ప్రభుత్వం... మున్ముందు కేవలం ఎలక్ర్టిక్‌ వాహనాలు మాత్రమే అమ్మేలా చర్యలు తీసుకొంటోంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఒక నమూనా నోటిఫికేషన్‌ సిద్ధం  చేస్తోంది. దీని ప్రకారం 150 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాలు  కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉండాలని ప్రతిపాదించింది. 2024 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి త్రీవీలర్స్‌ ఈ నిబంధన వర్తింపజేయనున్నారు. అంటే 150 సీసీ కన్నా తక్కవ సామర్థ్యమున్న త్రీ వీలర్స్‌ అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలై అయి ఉండాలి. 2026 ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధనలను టూ వీలర్స్‌ కూడా వర్తింపచేస్తారు. అంటే 2026 ఏప్రిల్‌ 1 నుంచి టూ, త్రీ వీలర్స్‌ అన్నీ ఎలక్ట్రిక్‌ వాహనాలే అన్న మాట (150 సీసీ లోపు). దీనికి సంబంధించిన డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ కేంద్ర ప్రభుత్వం వారం లేదా పది రోజుల్లో విడుదల చేయనుంది. సంబంధిత వర్గాల స్పందన తెలుసుకున్న తరవాత ఈ విధానానికి తుది మెరుగులు ఇస్తారు.