ఆర్టీసీ సమ్మెకు పెరుగుతున్న మద్దతు.. ఆందోళనలో ప్రభుత్వం..!! 

ఆర్టీసీ సమ్మెకు పెరుగుతున్న మద్దతు.. ఆందోళనలో ప్రభుత్వం..!! 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ దసరాకు ముందు నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సమ్మె కారణంగా తెలంగాణాలో బస్సులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నా.. తగినన్ని ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  సమయానికి తగిన విధంగా బస్సులు తిరగడం లేదు.  పైగా బస్సుల్లో అత్యధిక చార్జీలు వసూలు చేస్తున్నారు.  

సమ్మెలో పాల్గొన్న కార్మికులను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో...సమ్మె ఉదృతం అయ్యింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.  తాజాగా తెలంగాణ ట్రేడ్‌ యూనియన్‌ ఫ్రంట్‌ లోని 21 విద్యుత్‌ సంఘాలు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపాయి.  ఈ విధ్యుత్ సంఘాలతో పాటు అటు హైకోర్ట్ న్యాయవాదులు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ర్యాలీని నిర్వహించడం విశేషం.