రేవు జలపాతం దగ్గర ఏనుగు మృతి..

రేవు జలపాతం దగ్గర ఏనుగు మృతి..

చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు మృతిచెందింది... పలమనేరు రూరల్ మండలం మందిపేట, కోటూరు గ్రామం ఉసిరిపెంట అటవీ ప్రాంతంలోని కళ్యాణ రేవు జలపాతం దగ్గర ఏనుగు చనిపోయినట్టు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.. ఏనుగు మూడు, నాలుగు రోజుల క్రితమే మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. ఏనుగుది సహజ మరణమా? ఇంకా ఎవరైనా హతమార్చారా? అనే కోనంలో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టిన నట్టు తెలుస్తోంది.