60 నిమిషాల్లో రూ.16 వేల కోట్లు సంపాదించాడు..!

60 నిమిషాల్లో రూ.16 వేల కోట్లు సంపాదించాడు..!

గంటలో 16 వేల కోట్ల రూపాయలు. కోటి రెండు కోట్లు కాదు.. 16 వేల కోట్ల రూపాయలు. అది కూడా జస్ట్ జస్ట్ అరవై నిమిషాల్లోనే. ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్టాక్ మార్కెట్ పరిశీలకులను  మళ్లీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆయన సారథిగా ఉన్న విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ టెస్లా షేర్లు స్టాక్ మార్కెట్లో దూసుకుపోవడంతో ఎలాన్ వ్యక్తిగత సంపద అనూహ్యంగా పెరిగింది. కేవలం గంట వ్యవధిలోనే ఆయన సంపద విలువ 2.3 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 16, 443 కోట్లు పెరిగింది. 

నాలుగో త్రైమాసికంలో టెస్లా కంపెనీ అనుకున్న దానికంటే ఎక్కు లాభాలు గడించడంతో స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ల విలువ 12 శాతం పెరిగింది. దీంతో మస్క్ వ్యక్తిగత సంపద విలువ 36 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో వెల్లడైంది. టెస్లా కంపెనీలో ఎలాన్ వాటా 20 శాతం. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాల్యూ దాదాపు 100 బిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్.. అధునాతన టెక్నాలజీ కంపెనీల సృష్టికర్త. ప్రైవేట్ రాకెట్ల ను అంతరిక్షంలోకి పంపించే స్పేస్ ఎక్స్ కంపెనీ, ఎలక్ట్రిక్ కార్లు, ట్రక్ లను తయారు చేసే టెస్లా కంపెనీ కూడా ఎలాన్  మస్క్ ఏర్పాటు చేసినవే. 2050నాటికి 10లక్షల మందిని అంగారకుడి పైకి తీసుకెళ్లాలని టార్గెట్ గా  పెట్టుకున్నాడు మస్క్.