జుకర్‌బర్గ్‌ను దాటిన మస్క్

జుకర్‌బర్గ్‌ను దాటిన మస్క్

ప్రపంచ ధనికుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో అడుగు ముందుకేశారు. ఇప్పటి వరకు ధనికుల లిస్ట్‌లో ఫేస్‌బుక్ ఓనర్ మార్క జుకర్‌బర్గ్ తరువాత ఉన్న మస్క్ ఇటీవల జరిగిన టెస్లా అడిషన్ ద్వారా కొనుగోలయిన షేర్‌లతో ఇప్పుడు జుకర్‌బర్గ్‌ను దాటి ముందుకెళ్లాడు. అయితే ఇటీవల పెరిగిన 12శాతం స్టాక్‌తో టెస్లా ఓనర్ ఆదాయం 11.8 బిలియన్లు పెరిగింది. దాంతో ఆయన మొత్తం ఆదాయం 114 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే బ్లూంబర్గ్ బిలియనీర్ సంస్థ లెక్కల ప్రకారం మస్క్ జుకర్‌బర్గ్ స్థానంలోకి వెళ్లాడు. దాంతో ప్రపంచ ధనికులలో మూడవ స్థానానికి చేరాడు. అయితే ఈ లాభాలు కేవలం మస్క్‌కు చేరవు మరికొన్ని సంస్థలైన స్పేస్ ఎక్స్, బోరింగ్ కంపెనిలకు అందులో వాటా ఉంటుంది. మరి మస్క్ తన స్తానాన్ని ఎన్నాళ్లు ఉంచుకుందటాడో చూడాలి. అంతేకాకుండా మస్క తన మాన్షన్స్‌ను అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఆయన ఎప్పుటూ క్యాష్ పూర్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడతానని చెబుతుంటారు. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధిక జీతం తేసుకునేవారిలో మస్క్ ఉంటాడు. కానీ మస్క్ సంస్థనుంచి ఎటువంటి జీతాన్ని ఇప్పటివరకూ తీసుకోలేదు. దీంతో డిసెంబరులో టెస్లా ఎస్‌పీ 500 ఇండెక్స్ బెంచ్‌మార్క్‌ను చేరనుంది.