బీజేపీకి ఇచ్చిన ఓట్లు 9.. వచ్చిన ఓట్లు 17..!

బీజేపీకి ఇచ్చిన ఓట్లు 9.. వచ్చిన ఓట్లు 17..!

దేశ వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్న మూడో దశ పోలింగ్‌లోనూ ఈవీఎంల దుమారం రేగుతోంది. ముఖ్యంగా.. బీజేపీకి అనుకూలంగా ఈవీఎంలను 'ప్రొగ్రామింగ్‌' చేశారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గోవాలో ఇవాళ ఉదయం జరిగిన మాక్‌ పోలింగ్‌లోనే ఈవీఎంల పనితీరు బయటపడిందంటూ ఆ రాష్ట్ర 'ఆప్‌' చీఫ్‌ ఎల్వీస్‌ గోమ్స్‌ ట్వీట్‌ చేశారు. మాక్‌ పోలింగ్‌లో భాగంగా ఒక్కో పార్టీ అభ్యర్థిగా 9 చొప్పున ఓట్లను కేటాయించగా అనూహ్యంగా బీజేపీ అభ్యర్థికి 17 ఓట్లు పోలైనట్టు చూపించిదని చెప్పారు. గోవాలోని బూత్‌ నంబర్‌ 31లో నిర్వహించిన మాక్‌ పోలింగ్‌లో బీజేపీ అభ్యర్థికి 17, కాంగ్రెస్‌ అభ్యర్థికి 9, ఆప్‌ అభ్యర్థికి 8, ఇండిపెండెంట్‌ అభ్యర్థికి ఒక ఓటు పోలయ్యాయని గోమ్స్‌ వివరించారు. ఈ ఘటనను 'ఎలక్షన్‌ ఆఫ్‌ షేమ్‌'గా ఆయన అభివర్ణించారు.  గోమ్స్‌ ఆరోపణలకు స్పందించిన ఎన్నికల అధికారులు.. సంబంధిత పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంలను మార్పు చేశామని ప్రకటించారు.