ఎన్టీఆర్ హీరోయిన్ దొరికింది !!

ఎన్టీఆర్ హీరోయిన్ దొరికింది !!

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది.  రాజమౌళిదర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ లు హీరోలు.  ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇందులో రామ్ చరణ్ కు జోడిగా అలియా నటిస్తోంది.  ఎన్టీఆర్ జోడిగా మొదట డైసీని అనుకున్నారు.  

కానీ ఆమె కొన్ని కారణాల వలన పక్కకు తప్పుకున్నది.  దీంతో ఎన్టీఆర్ హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారా అని ఫ్యాన్స్ ఎదురు చూశారు.  అనేక పేర్లు తెరమీదకు వచ్చినా కథ ప్రకారం విదేశీ భామనే కావాలని రాజమౌళి పట్టుబడ్డాడు.  చివరకు ఎమ్మా రాబర్ట్స్ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.  ఎమ్మా రాబర్డ్స్ వైల్డ్ చైల్డ్, నెర్వ్ అనే సినిమాలు చేసింది.  రాజమౌళి ప్రపోజల్ కు ఆమె ఒకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.  ఈ మూవీ వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.