అమిత్ షా సభకు జనాలు కరువు..

అమిత్ షా సభకు జనాలు కరువు..

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అధికార బీజేపీ ప్రచారాలు ఊపందుకున్నాయి. అగ్ర నేతలందరూ..  తీరిక లేకుండా ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. పార్టీ శ్రేణులకు మాత్రం సభలకు జనసమీకరణ చేయడం కత్తిమీద సాములా మారుతోంది. దీంతో బీజేపీ ప్రచార సభలన్నీ జనం లేక వెలవెలబోతున్నాయి. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొనే ర్యాలీలో సైతం జనాలు కరువయ్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అమిత్ షా పాల్గొనే సభకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి ప్రసంగం వినేందుకు ఖాళీ కుర్చీలు ఉన్నాయి. అంటూ ట్వీట్ చేశారు.