కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌ అనంత్‌నాగ్‌లోని కొకేర్‌నాగ్‌ వద్ద భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కొంత ఉగ్రవాదులు నక్కిన ఓ భవనాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభించాయి. దీంతో ఉగ్రవాదులు కూడా వారిపై ఎదురుకాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. లోపల మరికొంత మంది ఉగ్రవాదులు ఉన్నట్లు సైన్యం అనుమానిస్తుంది.