తెలంగాణాలో మరో ఎన్‌కౌంటర్‌ ..ముగ్గురు మావోలు మృతి..!

తెలంగాణాలో మరో ఎన్‌కౌంటర్‌ ..ముగ్గురు మావోలు మృతి..!

తెలంగాణాలో వరుస ఎన్కౌంటర్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్ లలో 5గురు మావోలు మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్పీ సునీల్ దత్ ఓ ప్రకటన విడుదల చేసారు. చెన్నాపురం అటవీప్రాంతంలో గుట్టల వద్ద రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి పేర్కొన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో ఒకఋ పురుషుడు కాగా ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. వారి వద్ద నుంచి 01 పిస్టల్, ఒక 8ఎంఎం రైఫిల్, బ్లాస్టింగ్ సామాగ్రిని ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం  చేసుకున్నారు  ఈ నెల 27 వరకు జరగనున్న మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పోలీసు బలగాలు జిల్లాలోని చర్ల, మణుగూరు, ఛత్తీస్ గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.