చివరి 20 నిమిషాలే కీలకంగా మారిందా..!!

చివరి 20 నిమిషాలే కీలకంగా మారిందా..!!

సినిమా ఫస్ట్ సోసో గా నడిచినా పెద్దగా పట్టించుకోరు.  అదే సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ గా లేదంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించకుంటే సినిమా బోర్ కొడుతోంది.  సెకండ్ హాఫ్ లో అద్భుతమైన ట్విస్ట్స్, ఆసక్తికరించే అంశాలు ఉండాలి.  అలా ఉన్నప్పుడే సినిమా హిట్ అవుతుంది.  

ఇదే యూటర్న్ సినిమాకు ప్లస్ అయినట్టుగా తెలుస్తున్నది.  ఫస్ట్ హాఫ్ ను థ్రిల్లింగ్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ ను కూడా అదే రేంజ్ థ్రిల్లింగ్ కలిగించేలా తీర్చిదిద్దాడట.  చివరి 20 నిముషాలు సినిమాకు ప్రాణం అని, ఆ 20 నిముషాలు సినిమాను నిలబెట్టాయని సమంత చెప్తున్నది.