కృష్ణానదిలో దూకి ఈవో ఆత్మహత్య

కృష్ణానదిలో దూకి ఈవో ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో ఈవో అనిత ఆత్మహత్య చేసుకున్నారు. గురజాల మండలం దైద ఆలయం, గురజాల టౌన్ లో ఉన్న గుడిలోనూ  ఈవోగా అనిత పని చేస్తున్నారు. అయితే లెక్కలు చూపించకుండా అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు ఈనెల 18న సస్పెండ్ చేసారు.  దీనికి తోడు భర్తతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్న కారణంగా ప్రస్తుతం తండ్రి అంజయ్య వద్ద అనిత  ఉంటుంది. భార్యా భర్తల మధ్య గొడవలకుతోడు ఉద్యోగం నుండి సస్పెన్షన్ కావడం వల్లే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.