ఈడీని తాకిన కరోనా.. ఈడీ సెంట్రల్ ఆఫీస్‌ మూత..

ఈడీని తాకిన కరోనా.. ఈడీ సెంట్రల్ ఆఫీస్‌ మూత..

ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికీ కరోనా వ్యాపించింది. ఢిల్లీ లోక్‌నాయక్‌ భవన్‌ ఖాన్ మార్కెట్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఐదుగురు అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. రేపటివరకు ఆఫీసును మూసివేస్తున్నట్టు ప్రకటించారు. దేశరాజధాని ఢిల్లీలో రోజురోజుకూ కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది... పార్లమెంట్, రక్షణ, ఆరోగ్య శాఖ కార్యాలయాల తర్వాత ఇప్పుడు ఈడీని తాకింది.. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడుతూనే ఉన్నారు.. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంల తాత్కాలికంగా మూసివేయడంతో పాటు.. కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్న 10 మందికిపైగా ఈడీ సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. శానిటైజేషన్‌ పనులు చేపట్టేందుకు ఈడీ కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాన్ని వారానికి రెండు రోజులు శానిటైజేషన్‌‌ చేస్తూ వస్తున్నారు పారిశుధ్యసిబ్బంది. కరోనా నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు హాజరవుతూ వచ్చారు.. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు రావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.