20 నుంచి ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్

20 నుంచి ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్

ఈ నెల 20 నుంచి ఎంసెట్‌–2018 చివరి దశ కౌన్సెలింగ్‌కు షెడ్యూల్‌ను ప్రకటించింది. అలాగే కాలేజీల పరిధిలో ఇంటర్నల్‌ స్లైడింగ్, స్పాట్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఇప్పటివరకు ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం ఫీజు చెల్లించకుండా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాని వారు ఈ నెల 20, 21 తేదీల్లో ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని అధికారులు అన్నారు.  ప్రాసెసింగ్‌ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1,200 ఉంటుందని.. https://tseamcet. nic.in వెబ్‌సైట్‌లో క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు/నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చని వెల్లడించారు. ఈ నెల 21న హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేయించుకోవాలని, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించే సమయంలో మొబైల్, ఆధార్‌ నంబరు, కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాల నంబర్లతోపాటు ఈ మెయిల్‌ ఐడీ కచ్చితంగా ఇవ్వా లని అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి ఈ నెల 25న సీట్లను కేటాయించనున్నట్లు వివరించారు. ఈ నెల 25 నుంచి 27  వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని తెలిపారు. సీట్లు పొందిన కాలేజీల్లో 27లోగా చేరా లని అధికారులు  తెలిపారు.