మోమో చాలెంజ్ పంపుతున్న విద్యార్ధి అరెస్ట్

మోమో చాలెంజ్ పంపుతున్న విద్యార్ధి అరెస్ట్

వాట్స్ ఆప్ లో పలువురికి మోమో చాలెంజ్ పంపిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్ధిని కోల్ కత్తా పోలీసులు అరెస్ట్ చేశారు. తన వివరాలను మార్పింగ్ చేసి విద్యార్ధులు, గ్రూప్ లోని సభ్యులకు పంపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్ లోని కేటుగ్రామ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల విద్యార్ధి అరిందం పాత్రో ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో పశ్చిమ బెంగాల్ లో మోమో చాలెంజ్ పై జరిగిన మొదటి ఆరెస్ట్ ఇదే. 

తన మిత్రుడు జాయ్ కృష్ణ పాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాత్రోని అరెస్ట్ చేసినట్లు కోల్ కత్తా డీఐజీ నిశాంత్ పర్వేజ్ తెలిపారు. నిందితుడు కట్వా ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడని, ఇతనిపై మాకు ఆగస్టు 28న ఫిర్యాదు అందినట్లు డీఐజీ తెలిపారు. ఇప్పటి వరకు మా వద్ద మోమో చాలెంజ్ పై 12 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ కేసులో మాత్రం నిందితుడిని అరెస్ట్ చేశామని అన్నారు. నిందితుడిపై ఐపీసీ 419, 505(1), 
ఐటీ చట్టంలోని 66D, 70 కింద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారి నిశాంత్ పర్వేజ్ తెలిపారు.

కికి చాలెంజ్ గేమ్‌ను మించిన మోమో గేమ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. నిన్న మొన్నటి వరకు హల్‌చల్ చేసిన బ్లూవేల్ చాలెంజ్ లాగే ఇప్పుడు ఈ మోమో చాలెంజ్ టీ నేజర్లను ఆత్మహత్య చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.