ఇంగ్లాండ్-వెస్టిండీస్ : మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆల్ అవుట్   

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆల్ అవుట్   

కరోనా వైరస్ విరామం తరువాత, అంతర్జాతీయ క్రికెట్ సౌతాంప్టన్‌లో నిన్న తిరిగి ప్రారంభమైంది. ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ ప్రస్తుతం మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. జో రూట్ లేకపోవడంతో ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక నిన్న ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. అయితే ఈ రోజు కరేబియన్ బౌలర్లు చెలరేగడం తో ఇంగ్లాండ్ జట్టు 204 పరుగులకే మొదటి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయ్యింది. ఇక ఇంగ్లాడ్ బ్యాటింగ్ లో ఒకరు కూడా కనీసం హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.  వారి కెప్టెన్  స్టోక్స్(43) పరుగులే అత్యధికం. ఇక వెస్టిండీస్ కెప్టెన్  జాసన్ హోల్డర్ 6 వికెట్లు తీసుకొని తన టెస్ట్ కెరియర్ లో ఏడోసారి 5 వికెట్స్ హల్ లో చేరిపోయాడు. మరో బౌలర్ షానన్ గాబ్రియేల్ 4 వికెట్లు తీసాడు. అంటే కేవలం ఇద్దరు బౌలర్లు మాత్రమే ఆతిధ్య జట్టును కూల్చేశారన్నమాట. బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన కరేబియన్లు బ్యాటింగ్ లో ఏం చేస్తారో చూడాలి మరి.