ఆసీస్ పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడికి కరోనా పాజిటివ్...

ఆసీస్ పర్యటన ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ఆటగాడికి కరోనా పాజిటివ్...

క్రికెట్ కు కరోనా ఇచ్చిన విరామం తర్వాత మొదటి అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆతిధ్యం ఇచ్చింది. కేవలం ఈ సిరీస్ కు మాత్రమే కాకుండా తర్వాత ఐర్లాండ్, పాకిస్తాన్ ఈ మధ్యే ఆస్ట్రేలియా జట్టుకు కూడా వన్డే, టీ 20 సిరీస్ కు ఆతిధ్యం ఇచ్చింది. ఆసీస్ పర్యటన ఈ నెల 16 న ముగియడంతో ఆ జట్లలోని ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడేందుకు ఈ రోజు దుబాయ్ కి వచ్చేసారు. దాంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు నిర్వహించిన అన్ని సిరీస్ లు ప్రశాంతంగా ముగిసాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఓ ఇంగ్లాండ్ ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆసీస్ తో జరిగిన వన్డే జట్టుకు ఎంపిక కానీ డేవిడ్ విల్లీకి కరోనా సోకింది. అతనితో పాటుగా అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇంగ్లాండ్ తరపున ఇప్పటివరకు 48 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన విల్లీ ఈ ఏడాది ఐపీఎల్ లో పాల్గొనడం లేదు. అయితే గతంలో మాత్రం అతను చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్ జట్టులో కరోనా వచ్చిన మొదటి ఆటగాడు డేవిడ్ విల్లీ.