ఆ ఆటగాళ్లకు 6 రోజులు కాదు 36 గంటలే...

ఆ ఆటగాళ్లకు 6 రోజులు కాదు 36 గంటలే...

కరోనా కష్టకాలంలో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జట్లు యూఏఈ చేరుకున్నాయి. అక్కడికి వెళ్లిన తర్వాత ఆటగాళ్లు ఆరు రోజులు క్వారంటైన్ లో ఉండలి. ఆ సమయంలో వారికి చేసిన మూడు కరోనా పరీక్షలో నెగెటివ్ వస్తే వారిని బయో సేఫ్టీ బాబుల్ లోకి అనుమతిస్తారు. అందులోనే ఉండి ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ మ్యాచ్ లు ఆడాలి. అయితే ఐపీఎల్ లో పాల్గొనే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ ద్వైపాక్షిక సిరీస్ లు ముగించుకొని ఈ రోజే దుబాయ్ చేరుకున్నారు. నియమాల ప్రకారం వారు కూడా ఆరు రోజుల క్వారంటైన్ లో ఉండాలి. కానీ అలా చేస్తే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లను వారు కోల్పోతారు. అందువల్ల వారి క్వారంటైన్ సమయాన్ని 6 రోజుల నుంచి 36 గంటలకు కుదించినట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఎందుకంటే వారు ఇన్ని రోజులు ఇంగ్లాండ్ లో బయో బబుల్ లో ఉండే మ్యాచ్ లు ఆడారు. అందుకే ఆ ఆటగాళ్లను  36 గంటలు క్వారంటైన్ లో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో నెగెటివ్ వస్తే వారు ఐపీఎల్ బయో బబుల్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో అన్ని ఐపీఎల్ జట్లు ఆనందం వ్యక్తం చేసాయి.