నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు ఇదే

నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్‌ జట్టు ఇదే

టీమిండియాతో జరిగే నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జట్టులో మొయిన్‌ అలీ, జేమ్స్‌ విన్స్‌కు చోటు దక్కింది. మూడో టెస్టు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ ఎడమ మోకాలికి గాయమైంది. మరోవైపు మూడో రోజు ఆట భారత్ రెండో ఇన్నింగ్స్ లో బౌలర్ జేమ్స్ ఆండర్సన్ వేసిన బంతిని బ్యాట్స్ మెన్ పుజారా వదిలేయడంతో వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో పట్టుకున్నాడు. బంతి బెయిర్‌స్టో ఎడమ చేతి మధ్య వేలికి బలంగా తాకడంతో గాయమైంది. ఈ నేపథ్యంలో జేమ్స్‌ విన్స్‌ను జట్టులోకి తీసుకుంది. నాలుగవ టెస్టుకు చాలా సమయం ఉంది. అప్పటికి బెయిర్‌ స్టో గాయం తగ్గకపోతే బట్లర్‌ వికెట్‌ కీపర్‌ బాధ్యతలు నిర్వహిస్తాడని ఇంగ్లాండ్ సెలక్టర్‌ స్మిత్‌ తెలిపాడు. బెన్ స్టోక్స్‌ గాయం కారణంగా స్పిన్నర్, బ్యాట్స్ మెన్ మొయిన్‌ అలీ జట్టులోకి వచ్చాడు.

జట్టు: 

జో రూట్‌ (కెప్టెన్‌), అలెస్టర్‌ కుక్‌, కేతన్ జెన్నింగ్స్‌, జానీ బెయిర్‌ స్టో(వికెట్ కీపర్), జొస్ బట్లర్‌, ఓలై పోప్‌, మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌, సామ్ కరన్‌, జేమ్స్ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌ వోక్స్‌, బెన్‌ స్టోక్స్‌, జేమ్స్‌ విన్స్‌.