ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!
లార్డ్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న ఐసీసీ వలర్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు సంచలన వ్యాఖ్యాలు చేశాడు ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్... మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్మీట్లో మోర్గాన్ మాట్లాడుతూ... మా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరడమే ఎక్కువగా భావిస్తున్నామని అభిప్రాయపడ్డారు. ఇక, ఫైనల్ మ్యాచ్ ఫలితం గురించి ఆలోచించి అనవసరంగా ఒత్తిడి గురికావాలని తాను అనుకోవడంలేదన్న మోర్గాన్... నేను ట్రోఫీ ఎత్తుకుంటాననే విషయాన్ని తలకు ఎక్కించుకోను.. అనవసరమైన విషయాలను పట్టించుకుంటే దాని ఫలితం మరోలా ఉంటుందన్నాడు. ఫైనల్స్ మ్యాచ్‌లో ఆడేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాం.. ఈ మ్యాచ్‌లో మేం ఆటని ఆస్వాదించాలనుకుంటున్నాం. మా జట్టులోని ప్రతీ ఆటగాడు పూర్తి ఫిట్నెస్తో ఉండటం తమకు కలిసివచ్చే అవకాశం అని చెప్పుకొచ్చారు. మరోవైపు వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఢీకొనగా... మూడు సార్లు ఇంగ్లండ్, ఐదుసార్లు కివీస్ జట్టు విజయం సాధించాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లూ వరల్డ్ కప్‌ను గెలవకపోగా... ఇప్పుడు ఎవరు విజయం సాధించిన కొత్త రికార్డు నెలకొల్పినట్టే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)