ఇంగ్లాండ్ వరల్డ్ జట్టులో 'జోఫ్రా ఆర్చర్' కు చోటు

ఇంగ్లాండ్ వరల్డ్ జట్టులో 'జోఫ్రా ఆర్చర్' కు చోటు

మరికొద్ది రోజుల్లో సొంతగడ్డపై జరగనున్న ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ 15 మందితో కూడిన తుది జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ సెలక్టెర్లు ఆల్ రౌండర్ జోఫ్రాఆర్చర్ కు జట్టులో స్ధానం కల్పించారు. గత నెలలో ఇంగ్లాండ్ సెలక్టర్లు ప్రకటించిన ప్రిలిమినరీ జట్టులో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఐర్లాండ్ సిరిస్‌తో పాటు పాకిస్థాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేయడంతో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జోప్రా ఆర్చర్ ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరుపున కేవలం మూడు వన్డేలు, ఒక టీ20 మాత్రమే ఆడాడు. ఆర్చర్‌తో పాటు సెలక్టర్లు లియామ్ డాసన్, జేమ్స్ విన్సీలను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేశారు. ఈ ముగ్గురి స్థానంలో డేవిడ్ విల్లీ, జోయి డేన్లే, అలెక్స్ హేల్స్‌పై వేటు వేశారు.

ప్రపంచ కప్‌కు ఇంగ్లాండ్ జట్టు:
ఇయామ్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్ స్టో, జోస్ బట్లర్, టామ్ కర్రన్, లియామ్ డాసన్, లియాం ప్లంకెట్, అదిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, జేమ్స్ విన్సీ, క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్