లార్డ్స్‌ టెస్ట్‌: భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌

 లార్డ్స్‌ టెస్ట్‌: భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్‌

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ పట్టు బిగించింది. ఆచితూచి ఆడుతూనే 200 పరుగుల మైలురాయిని చేరుకుంది. బెయిర్‌స్టో 62(99) అర్ధశతకంతో రాణించడమే కాకుండా, వోక్స్‌ 56(83)తో కలిసి ఆరో వికెట్‌కు 100 పరుగుల  భాగస్వామ్యాన్ని జోడించాడు. అంతేకాకుండా 124 పరుగుల ఆధిక్యాన్ని సైతం ఇంగ్లీష్‌ జట్టు సాధించింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌లో జెన్నింగ్స్(11), కుక్(21), పోప్(28), రూట్(19), బట్లర్‌(24) స్వల్ప స్కోర్లకు పెవిలియన్‌ చేరారు. షమీ రెండు వికెట్లు తీయగా, ఇషాంత్‌ శర్మ, పాండ్య చెరో వికెట్‌ దక్కించుకున్నారు.